Monday, December 30, 2024

ఇడి ఆఫీస్‌కు బయలుదేరిన రాహుల్

- Advertisement -
- Advertisement -


ఢిల్లీ: ఎఐసిసి కార్యాలయం నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇడి ఆఫీస్‌కు బయలుదేరారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇడి ముందు రాహుల్ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇడి ఆఫీసుల ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సోనియా, రాహుల్ మద్దతుగా ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ నేతలు ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్ ఇడి ఆఫీసు నుంచి బయటకు వచ్చే వరకు ధర్నాలు చేపటనున్నారు. నెక్లెస్ రోడ్ నుంచి ఇడి ఆఫీస్ వరకు కాంగ్రెస్ నిరసన ర్యాలీ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News