Saturday, December 21, 2024

నెక్లెస్ రోడ్డులో కాంగ్రెస్ కార్యకర్తల భారీ ప్రదర్శన…

- Advertisement -
- Advertisement -

 

 

హైదరాబాద్: నెక్లెస్  రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి కాంగ్రెస్ నేతలు భారీ ప్రదర్శన చేపట్టారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇడి ముందు విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా ర్యాలీలు చేపట్టారు. నెక్లెస్ రోడ్డులోని  ఇందిరా గాంధీ విగ్రహం నుంచి తెలుగుతల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద నుంచి ఆదర్శ్ నగర్ మీదుగా హాక భవన్, కళాంజలి నుంచి ఇడి కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టనున్నారు.  ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, స్టార్ కంపెయినర్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎఐసిసి నాయకులు బోసురాజు, చిన్నారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, షబ్బీర్ అలీ తదితర ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News