Sunday, January 19, 2025

బెంగళూరులో సిద్ధాంత్ కపూర్ అరెస్ట్ !

- Advertisement -
- Advertisement -

Siddanth Kapoor

బెంగళూరు: ప్రముఖ హిందీ నటుడు శక్తి కపూర్ కుమారుడు సిద్ధాంత్ కపూర్ ని బెంగళూరులో పోలీసులు ఆదివారం రాత్రి మాదకద్రవ్యాలు సేవించినందుకు అరెస్టు చేశారు. అతడు ప్రముఖ నటి శ్రద్ధా కపూర్ కు సోదరుడు. దాదాపు 20కి పైగా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అతడి అరెస్టు గురించి ఓ సీనియర్ పోలీస్ అధికారి సోమవారం తెలిపాడు. డ్రగ్ పార్టీకి సంబంధించిన ఉప్పందడంతో ఓ ఫైవ్ స్టార్ హోటల్ పై అధికారులు రైడ్ చేశారు. ఆ డ్రగ్ పార్టీకి దాదాపు 35 మంది హాజరైనట్టు తెలిసింది. వారందరిని కస్టడీలోకి తీసుకున్నారు.  ఆ పార్టీకి హాజరైన అతిథులందరినీ తర్వాత వైద్య పరీక్ష చేయించారు. ఆ వైద్య పరీక్షలో సిద్ధాంత్ కపూర్ డ్రగ్స్ సేవించినట్లు తేలిందని పోలీస్ డిప్యూటీ కమిషనర్(తూర్పు) భీమాశంకర్ ఎస్. గులేడ్ చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని, కేసు రిజిష్టరు చేసినట్టు కూడా ఆయన తెలిపారు. కాగా నిందితుడిని ఇంకా కోర్టు ముందు ప్రవేశపెట్టాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News