Tuesday, December 24, 2024

బడిబాటకు రాష్ట్రమంతా అపూర్వ స్పందన: సబితా ఇంద్రారెడ్డి

- Advertisement -
- Advertisement -

Unprecedented response to badibata

 

హైదరాబాద్: మన ఊరు-మన బడితో స్కూళ్లలో మౌలిక వసతుల అభివృద్ధి జరిగిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రమంతా పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. గన్‌ఫౌండ్రీలోని మహబూబియా ప్రభుత్వ పాఠశాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్భించారు. మంత్రి సబితాకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. మౌలిక వసతుల గురించి విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు మంత్రి సబిత చాక్లెట్లు పంచారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఇంగ్లీష్ మీడియం బోధనపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారని కొనియాడారు. బడిబాటకు రాష్ట్రమంతా అపూర్వ స్పందన లభిస్తోందని చెప్పారు. గురుకులాల తరహాలోనే అన్ని ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News