Saturday, December 21, 2024

రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Telangana with 2.5% Indias Population Contributes 5% GDP: KTR 

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. దేశ ప్రజలను మోసం చేస్తూ, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రంపై కెటిఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆర్థికంగా మరింత పరిపుష్ఠం అవుతోందని అన్నారు. దేశ జనాభాలో కేవలం 2.5 శాతం ఉన్న తెలంగాణ జిడిపిలో ఐదు శాతం వాటా అందిస్తోందని తెలిపారు. గతేడాది అక్టోబర్‌లో ఆర్‌బిఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణ దేశ జిడిపిలో 5 శాతాన్ని కలిగి ఉందని పేర్కొన్నట్లు మంత్రి వివరించారు. ప్రస్తుతం దేశానికి రెండింతల ప్రభావం చూపగల పరిపాలన అవసరమన్న కెటిఆర్ పనికిమాలిన డబుల్ ఇంజిన్‌లు అక్కర్లేదని ఎద్దేవా చేశారు.

Telangana with 2.5% Indias Population Contributes 5% GDP: KTR 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News