Monday, December 23, 2024

మిస్టిక్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

Makers release SDT15 glimpse

కొంతకాలం క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ మెల్లిమెల్లిగా కోలుకున్నారు. ఈ సమయంలో కొన్నాళ్ల పాటు ఆయన సినిమాలకు బ్రేక్ తీసుకున్నారు. పూర్తిగా కోలుకున్నాక షూటింగ్‌కి హాజరవుతున్నారు. ప్రస్తుతం కార్తిక్ దండు డైరక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు సాయిధరమ్‌తేజ్. స్టార్ ప్రొడ్యూసర్ బివిఎస్‌యన్ ప్రసాద్, క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ కలిసి నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నారు సాయిధరమ్‌తేజ్. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే మిస్టిక్ థ్రిల్లర్ ఇది. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఫ్యాన్స్ కోసం మేకర్స్ బిహైండ్ ద సీన్స్ పిక్చర్‌ని విడుదల చేశారు. లైట్, షాడో మధ్య కనిపిస్తోంది పిక్చర్. డీప్ షాడోస్‌లో మేకర్స్ ఫ్రేమ్ పెట్టినట్టు అర్థమవుతోంది. ఇక 25 రోజుల్లో 30 శాతం సినిమా షూటింగ్ పూర్తయింది. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. వరుస చావులకు కారణం తెలుసుకోవడానికి ఓ గ్రామానికి వెళ్లిన హీరో కథే ఈ సినిమా. ’సిద్ధార్థి నామ సంవత్సరే, బృహస్పతి సింహరసౌ స్థిత సమయే, అంతిమ పుష్కరే’ అంటూ పోస్టర్ మీద రాసిన మాటలు ఆకట్టుకుంటున్నాయి.

Makers release SDT15 glimpse

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News