Monday, December 30, 2024

టీమిండియాకు చావో రేవో

- Advertisement -
- Advertisement -

IND vs SA 3rd T20 Match Today at Visakhapatnam

టీమిండియాకు చావో రేవో
సిరీస్‌పై సౌతాఫ్రికా కన్ను, నేడు విశాఖలో మూడో టి20
విశాఖపట్నం: ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఓటమి పాలై డీలా పడిన టీమిండియాకు మంగళవారం సౌతాఫ్రికాతో జరిగే మూడో టి20 సవాల్‌గా మారింది. సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి భారత్‌కు నెలకొంది. ఒక మాటలో చెప్పాలంటే సాగర తీర నగరం విశాఖలో జరిగే ఈ మ్యాచ్ రిషబ్ పంత్ సేనకు చావో రేవో వంటిదని చెప్పక తప్పదు. ఇక వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన సౌతాఫ్రికా సిరీస్‌పై కన్నేసింది. మూడో టి20లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సఫారీ టీమ్ సమతూకంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో బౌలర్లు విఫలమైనా మిల్లర్, డుసెన్ అద్భుత బ్యాటింగ్‌తో సౌతాఫ్రికా భారీ లక్ష్యాన్ని సయితం అలవోకగా ఛేదించి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక కటక్ టి20లో బౌలర్లు అద్భుతంగా రాణించి టీమిండియాను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. ఇక సునాయాసమైన లక్ష్యాన్ని సౌతాఫ్రికా ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ బవుమా, వికెట్ కీపర్ క్లాసెన్ అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచారు. ఇక మిల్లర్ కూడా తనవంతు పాత్ర పోషించడంతో దక్షిణాఫ్రికా అలవోక విజయాన్ని సొంతం చేసుకుంది. బౌలింగ్‌లో కూడా మెరుగు పడడం సఫారీలకు మరింత కలిసి వచ్చే అంశంగా చెప్పాలి.
సవాల్ వంటిదే..
మరోవైపు మూడో టి20 టీమిండియాకు చావో రేవోగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. ఇక కటక్‌లో భారత్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఈసారైన భారీ స్కోరును సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బౌలింగ్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. తొలి మ్యాచ్‌లో 211 పరుగులు సాధించినా ఓటమి తప్పలేదు. రెండో టి20లో ఒక్క భువనేశ్వర్ కుమార్ మాత్రమే రాణించాడు. మిగతావారు విఫలం కావడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే టీమిండియాకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. లేకుంటే హ్యాట్రిక్ ఓటమి ఖాయం.

IND vs SA 3rd T20 Match Today at Visakhapatnam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News