Friday, November 22, 2024

భారత్ లో టాలెంట్ ఉన్న ఉద్యోగులకు కొదవ లేదు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Many talented employees in India

హైదరాబాద్: వరల్డ్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ సెంటర్ టి హబ్, టి సెల్ హైదరాబాద్ లో ఉన్నాయని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు.  ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ సెంటర్ ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. హైటెక్ సిటీలో జాన్సన్ కంట్రోల్స్ కు చెందిన ఓపెన్ బ్లూ ఇన్నో వేషన్ సెంటర్ ఉంది. జాన్సన్ కంట్రోల్స్ భారత్ లో తమ కార్యకలాపాలను విస్తరించింది. ఇంట్రూజన్, యాక్సెస్ కంట్రోల్, వీడియో సర్వైపలెన్స్ ప్రొడక్ట్స్ తయారీ చేస్తుంది. ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ లో 500 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. హైదరాబాద్ లో ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేస్తామని జాన్సన్ కంట్రోల్స్ తెలిపింది. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. ఇమేజ్ టవర్స్ కూడా నిర్మిస్తున్నామని, హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నిర్మిస్తున్నామన్నారు. భారత్ లో టాలెంట్ ఉన్న ఉద్యోగులకు కొదవ లేదన్నారు. పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి హైదరాబాద్ అడ్డగా మారబోతుందన్నారు. హైదరాబాద్ లో అద్భుతమైన మౌళిక వసతులు ఉన్నాయని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News