Saturday, November 23, 2024

ఉక్రేనియన్ లక్ష్యాల వద్ద క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిన రష్యా యుద్ధనౌక

- Advertisement -
- Advertisement -

Russia missile attack on Ukraine

సెవాస్టోపోల్: నల్ల సముద్రంలో  ఓ రష్యా యుద్ధనౌక ఉక్రెయిన్‌లోని లక్ష్యాల వైపు క్షిపణులను ప్రయోగించింది. రష్యన్ ఫెడరేషన్ యొక్క రక్షణ మంత్రిత్వ శాఖ నుండి దీనికి సంబంధించిన  వీడియోను జెంజర్ న్యూస్ ఛానల్ ఆదివారం పొందింది. “బ్లాక్ సీ ఫ్లీట్ ఫ్రిగేట్ సిబ్బంది నల్ల సముద్రం నుండి ఉక్రెయిన్ సైనిక స్థావరాల వద్ద నాలుగు కాలిబర్ క్రూయిజ్ క్షిపణుల సాల్వో ప్రయోగాన్ని నిర్వహిస్తారు” అని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

కాలిబ్ర్ అనేది యెకాటెరిన్‌బర్గ్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న నోవేటర్ డిజైన్ బ్యూరోచే అభివృద్ధి చేయబడిన రష్యన్ క్రూయిజ్ క్షిపణుల కుటుంబానికి చెందింది. దీనిని 1994లో సేవలోకి ప్రవేశపెట్టారు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వీటి దాడులలో ఏమి దెబ్బతిన్నదో …అవి ఎక్కడ జరిగాయో పేర్కొనలేదు. జెంజర్ న్యూస్ దీనిపై  స్పందన కోసం రష్యన్ ,  ఉక్రేనియన్ అధికారులను సంప్రదించింది,  కానీ ఈ వార్త అందించే సమయానికి వారి వద్ద నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఇదిలావుండగా ఉక్రెయిన్‌పై  రష్యా దాడి జూన్ 13 నాటికి 110వ రోజుకి చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News