Monday, December 23, 2024

క్రీడాకారిణి శాంతాకుమారికి అండగా నిలుస్తాం : మంత్రి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : క్రీడలలో వనపర్తి పేరును అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన శాంతాకుమారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో క్రీడాకారిణి శాంతాకుమారిని సన్మానించి రూ.లక్ష చెక్కును ఆయన అందజేశారు. వాలీబాల్ క్రీడాకారిణికి డబల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేశారు. అండర్ 18 వాలీబాల్ భారత జట్టుకు తెలంగాణ నుంచి ఎంపికయిన శాంతాకుమారి ఈ ఏడాది జూన్ లో తాష్కెట్ లో జరిగే ఆసియా మహిళల చాంపియన్ షిప్‌లో భారత జట్టులో ప్రాతినిధ్యం వహించనున్నారు. శాంతాకుమారి స్వగ్రామం వనపర్తి మండలం చిట్యాల తూర్పుతండా.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శాంతాకుమారి దేశానికి, రాష్ట్రానికి గుర్తింపును తెస్తుందని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News