Saturday, November 23, 2024

సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్లే : సుప్రీం వెల్లడి

- Advertisement -
- Advertisement -

Supreme Court ruled that cohabitation can be treated as marriage

 

న్యూఢిల్లీ : సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్లేనని, సహజీవన బంధాన్ని వివాహం గానే పరిగణిస్తామని సుప్రీం మంగళవారం పేర్కొంది. అంతేకాకుండా సహజీవనంలో కలిగే పిల్లలకు పూర్వీకుల ఆస్తిలో వాటా ఉంటుందని పేర్కొంది. 2009 లో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తాజాగా కొట్టివేస్తూ ఈ తీర్పు వెలువరించింది. చాలా ఏళ్లపాటు పెళ్లికి సహజీవనానికి చట్టం ఒకే విధంగా లేదని సుప్రీం కోర్టు గుర్తు చేసింది. కేరళ లోని ఎర్నాకులంకు చెందిన ఒక జంట సుదీర్ఘకాలం పాటు సహజీవనం చేసింది. వారికి ఒక కుమారుడు జన్మించాడు. అయితే ఆ జంట పెళ్లి చేసుకున్నట్టు సాక్షాలు లేని కారణంగా , ఆ కుమారుడిని అక్రమ సంతానంగా భావిస్తూ , పూర్వీకుల ఆస్తిలో వాటా దక్కదని 2009 లో కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. కేరళ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా, జస్టిస్ ఎస్ అబ్దుల్లా, జస్టిస్ విక్రమ్‌నాధ్‌లతో కూడిన ధర్మాసనం కేరళ హైకోర్టు తీర్పును తప్పు పడుతూ కొట్టి వేసింది. ఈ కేసులో తుది డిక్రీ జారీ ప్రక్రియను ట్రయల్ కోర్టు ఆలస్యం చేయడాన్ని సుప్రీం తప్పు పట్టింది. “ ఒక జంట భార్యాభర్తల్లా దీర్ఘకాలం పాటు కలిసి ఉంటే వారిని వివాహం చేసుకున్నట్టుగానే భావించాలి. సాక్షాధారాల చట్టం లోని సెక్షన్ 114 ఇదే సూచిస్తోంది. అలాగే ఇలాంటి సహజీవనంలో కలిగే సంతానానికి పూర్వీకుల ఆస్తిలో వాటా కూడా లభిస్తుంది. దీనిని అక్రమ సంతానంగా భావించకూడదు ” అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పును ఎవరైనా సవాల్ చేయవచ్చని కోర్టు పేర్కొంది. అయితే వారు పెళ్లి చేసుకోలేదని రుజువు చేయాల్సిన బాధ్యత సవాలు చేసిన వారిపైనే ఉందని సుప్రీం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News