Monday, December 23, 2024

ధరణి సమస్యలకు చెక్

- Advertisement -
- Advertisement -

అవసరమైతే కొత్త మాడ్యూల్ ప్రవేశపెడతాం

పైలట్ ప్రాజెక్టుగా ములుగు ఎంపిక
సిఎం కెసిఆర్ ఆదేశాలతో వందశాతం రైతు భూసమస్యల పరిష్కారానికి కంకణం
రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ధరణిపై అవగాహన సదస్సులు
రైతులు ఆందోళన చెందవద్దు, పైరవీకారులను ఆశ్రయించవద్దు
సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాలల్లో సిఎస్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావు సమీక్ష

మనతెలంగాణ/హైదరాబాద్/గజ్వేల్: ధరణి పోర్టల్ ఒక అద్భుతమని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మంగళవా రం ఉదయం ములుగు మండల కేం ద్రంలో నిర్వహిస్తున్న ధరణి పోర్టల్ అవగాహన సదస్సులో పాల్గొనడంతో పాటు రైతులతో ధరణి పోర్టల్ సమస్యలపై హరీష్‌రావు ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర సిఎం కెసిఆర్ ధరణి పోర్టల్‌ను తీసుకురావడంతో అది విప్లవాత్మకమైన మార్పు తీ సుకువచ్చిందన్నారు. దీనివల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయన్నారు. గతంలో ఎల్‌ఆర్‌యూపీ ద్వారా కొన్ని భూ సమస్యలు మిగిలిపోయాయని, ఆ సమస్యలను అర్థం చేసుకుని, ఒక్క భూ సమస్య లేకుండా పరిష్కరించే ది శగా కెసిఆర్ ఆదేశాల మేరకు ములుగులో ధరణిపై అవగాహన సద స్సు చే పట్టామని మంత్రి హరీష్‌రావు తెలిపా రు.

ధరణిలో నెలకొన్న చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగా ములుగు మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని వంద శాతం రైతుల భూ సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం సిఎం కెసిఆర్ ధరణి పోర్టల్ తీసుకు వచ్చారని, ఇది అతి పెద్ద కార్యక్రమమని, కొన్ని సాంకేతిక సమస్యలతో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆయన తెలిపారు.

రైతులకు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం

రైతుల భూముల విషయంలో తరతరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలు ధరణి ద్వారా పరిష్కారమవుతున్నాయన్నారు. కోర్టు కేసులు, కుటుంబ తగాదాల వల్ల కొన్ని భూ సమస్యలు పెండింగ్‌లో పడ్డాయన్నారు. కోర్టు కేసులు కాకుండా,వ్యక్తిగత సమస్యలు లేకుండా ఉన్న ప్రతి భూ సమస్యను పరిష్కరించడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ములుగు మండలంలో వంద శాతం భూ సమస్యలను పరిష్కరించి రైతులకు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. ములుగు తర్వాత ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్నీ గ్రామాల్లో చేపడతామన్నారు. టైం బౌండ్ ప్రోగ్రాంతో ఈ కార్యక్రమాన్ని వంద శాతం అన్నీ గ్రామాల్లో చేపట్టి భూ సమస్యలను పరిష్కారిస్తామని, ఎవరూ అసలు ఆందోళన చెందొద్దని ఆయన తెలిపారు.

రైతులెవరూ తమ సమస్యల పరిష్కారం కోసం పైరవీకార్లను ఆశ్రయించవద్దని, డబ్బులు ఇవ్వొద్దని ఆయన పేర్కొన్నారు. రైతుల భూములకు వందేళ్ల వరకు పూర్తి భద్రత ఉంటుందని, ధరణి ద్వారా అనేక అక్రమాలకు చెక్ పడిందని, భూమిపై పూర్తి హక్కు కల్పించబడిందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. గతంలో రిజిస్ట్రేషన్ కోసం వెళితే అనేక సమస్యలు ఉండేవని, ధరణి వచ్చాక గజ్వేల్ వెళ్లాల్సిన అవసరం లేకుండా ములుగు తహసీల్దార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్‌లు జరుగుతు న్నాయని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్ సోమేష్ కుమార్, సిఎం ఓఎస్డీ స్మితా సబర్వాల్, శేషాద్రి, రాహుల్ బొజ్జా, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, టిఎస్ టిఎస్ టెక్నీకల్ సర్వీసెస్ చైర్మన్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ధరణి ఒక విప్లవాత్మక కార్యక్రమం: సిఎస్

ధరణి ఒక విప్లవాత్మకమైన కార్యక్రమమని, సిఎం కెసిఆర్ ఈ కార్యక్రమాన్ని స్వయంగా రూపొందించారని సిఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. నిజమైన భూ యజమానులకు భూమిపై పూర్తి హక్కు కల్పించాలన్నదే సిఎం కెసిఆర్ అభిమతమన్నారు. భూమి బదిలీ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలన్నదే ధరణి ఉద్దేశ్యమని సిఎస్ పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌ను ఇప్పటివరకు 7 కోట్ల మంది వినియోగించుకున్నారని ఆయన తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా భూముల అమ్మకాలు, కొనుగోళ్లు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. పూర్తి పారదర్శకంగా ధరణి రిజిస్ట్రేషన్లు 15 నిమిషాల్లో పూర్తవుతున్నాయని ఆయన తెలిపారు.

ధరణిలో కొత్తగా మరో 33 మ్యాడ్యూల్స్ చేర్చాం

ధరణి పోర్టల్ లో ఎలాంటి సమస్య లేదు. సాంకేతిక సమస్యలే కొన్ని ఉన్నాయని సోమేష్‌కుమార్ పేర్కొన్నారు. ధరణిలో కొత్తగా మరో 33 మ్యాడ్యూల్స్ చేర్చామని, వీటి ద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఇతర చిన్న చిన్న సమస్యలను కూడా వంద శాతం పరిష్కరించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారని ఆయన తెలిపారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం నుంచి ఈ కార్యక్రమాన్ని పైలెట్‌గా ప్రారంభించామని సిఎస్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ సదస్సులు నిర్వహించి ప్రతి గ్రామంలో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని

రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు సిద్ధిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కళాశాలలో ధరణి పోర్టల్‌పై సంబంధిత అధికారులతో మంత్రి హరీష్‌రావు, సిఎస్‌లు మంగళవారం సమీక్ష జరిపారు. ధరణి పోర్టల్‌లో తలెత్తుతున్న సమస్యలను వారు అడిగి తెలుసుకున్నారు. ధరణి పోర్టల్ సమస్యలు, అధ్యయనం వాటి పరిష్కారం, వచ్చిన ఫిర్యాదులను ఎలా పరిష్కారం చేయాలన్న అంశాలపై అధికారులతో వారు సమాలోచనలను జరిపారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు వారు సూచనలు జారీ చేశారు.

సమస్యలను త్వరగా పరిష్కరించాలి: మంత్రి

ధరణి సమస్యల అధ్యయనానికి సంబంధించి ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను ఒక్కోక్కటిగా చర్చించి, వాటిలో సాంకేతికంగా ఎదురవుతున్న అంశాల గురించి వారు కూలంకషంగా అధికారులతో చర్చించారు. ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారం, వివిధ మాడ్యూల్స్, ఇతర సమస్యలను త్వరగా పరిష్కరించాలని మంత్రి హరీష్‌రావు, సిఎస్ అధికారులకు సూచించారు. ఈ మేరకు గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్ రెడ్డి డివిజన్ పరిధిలో ఇప్పటివరకు వివిధ అంశాలకు సంబంధించి 186, అలాగే ములుగు మండలంలో మరో 46 ఫిర్యాదులు వచ్చాయని మంత్రికి, సిఎస్‌కు ఆర్డీఓ తెలియచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News