Monday, December 23, 2024

దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణ : మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

Minister Harish Participates In Gajwel Market Committee

 

సిద్దిపేట: జిల్లా కేంద్రంలోనీ మార్కెట్ యార్డ్ లో నూతన సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఎమ్మెల్సీలు పారుక్ హుస్సేన్, యాదవ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. మార్కెట్ వ్యవస్థ కెసిఆర్ వచ్చాక చాలా బలోపేతం అయిందని మంత్రి పేర్కొన్నారు. మార్కెటింగ్ వ్యవస్థలో రిజర్వేషన్స్ తెచ్చిన ఘనత సిఎం కెసిఆర్ దేనని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అధ్బుతంగా రాణిస్తున్నారని తెలిపారు. ఈ మార్కెట్ కమిటీ మహిళకు కేటాయించారు. సిద్దిపేటలో లక్ష 20వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిందన్నారు. గత ప్రభుత్వాలు గోడౌన్ ల కోసం అలోంచించిన దాఖలాలు లేవన్న ఆయన ప్రతి మండలంలో 5వేల మెట్రిక్ టన్నుల గోడౌన్ లు నిర్మించామని మంత్రి పేర్కొన్నారు. దేశానికి అన్నం పెట్టే ధాన్య గారంగా తెలంగాణ మారిందన్నారు. ఆంధ్ర కంటే రెట్టింపు వరి పంట తెలంగాణలో పండిందని హర్షం వ్యక్తం చేశారు. పంట పండడం వల్ల ధాన్యం మోయడానికి కూలీలు దొరకని పరిస్థితి తెలంగాణ వచ్చింది. ఇతర రాష్ట్రాల నుండి కూలీలు వస్తున్నారు. పదవికి 5 ఏండ్లు మాత్రమే కానీ పెదవికి నూరేండ్లు ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News