- Advertisement -
సుమంత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘అహాం రీబూట్’. ఈ చిత్రాన్ని వాయుపుత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్‌లపై రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ గ్లిట్చ్ (ఫస్ట్ గ్లింప్స్) టీజర్‌ను హీరో అడివి శేష్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. సినిమా కాన్సెప్ట్‌ను తెలుసుకొని టీమ్‌ని అభినందించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం జూలైలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
‘Aham Reboot’ Movie First Glimpse Released
- Advertisement -