దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ జో రూట్ బ్యాటింగ్ విభాగంలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అసాధారణ బ్యాటింగ్‌ను కనబరుస్తున్న రూట్ తాజా ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న మార్నస్ లబూషేన్ (ఆస్ట్రేలియా)ను వెనక్కినెట్టి రూట్ టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. రూట్ 897 రేటింగ్ పాయింట్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), బాబర్ ఆజమ్ (పాకిస్థాన్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) టాప్5లో తమ స్థానాన్ని కాపాడుకున్నారు. శ్రీలంక ఆటగాడు కరుణరత్నే ఆరో, ఉస్మాన్ ఖ్వాజా (ఆస్ట్రేలియా) ఏడో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన 8వ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా) తొమ్మిదో, విరాట్ కోహ్లి (భారత్) పదో ర్యాంక్‌లో నిలిచారు.
ఇక బౌలింగ్ విభాగంలో పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) 901 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ (భారత్) రెండో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. ఇక భారత స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా ఒక ర్యాంక్‌ను మెరుగు పరుచుకుని మూడో స్థానానికి చేరుకున్నాడు. షాహిన్ అఫ్రిది (పాకిస్థాన్), కగిసో రబడా (దక్షిణాఫ్రికా) టాప్5 ర్యాంక్‌లో నిలిచాడు. కివీస్ ఫాస్ట్ బౌలర్ కైల్ జామీసన్ మూడు స్థానాలు కోల్పోయి ఆరో ర్యాంక్‌కు పడిపోయాడు. అయితే కివీస్‌కు చెందిన మరో ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఏకంగా నాలుగు ర్యాంక్‌లు మెరుగుపడి తొమ్మిదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. కాగా, ఆల్‌రౌండర్ల విభాగంలో భారత స్టార్ రవీంద్ర జడేజా టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. మరో స్టార్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. జేసన్ హోల్డర్ (విండీస్), షకిబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), బెన్‌స్టోక్స్ (ఇంగ్లండ్) టాప్5 ర్యాంకింగ్స్‌లో కొనసాగుతున్నారు.
ఇషాన్ కిషన్ జాక్‌పాట్
మరోవైపు ఐసిసి టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ సంచలనం ఇషాన్ కిషన్ టాప్10లో చోటు సంపాదించాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న టి20 సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తున్న ఇషాన్ కిషన్ తాజా ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఇషాన్ ఏకంగా 68 ర్యాంక్‌లను మెరుగుపరుచుకుని ఏడో ర్యాంక్‌కు చేరుకోవడం విశేషం. ఇక తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి ఇషాన్ ఒక్కడే టాప్10లో చోటు సంపాదించాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 818 పాయింట్లతో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. ఇక పాకిస్థాన్‌కే చెందిన మహ్మద్ రిజ్వాన్ రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఐడెన్ మార్‌క్రామ్ (సౌతాఫ్రికా) ఒక ర్యాంక్‌ను కోల్పోయి మూడో స్థానంలో నిలిచాడు. ఇక న్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కూడా బాబర్ ఆజమ్ టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. పాక్‌కే చెందిన ఇమాముల్ హక్ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లి మూడో, రోహిత్ శర్మ నాలుగో ర్యాంక్‌ను దక్కించుకున్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ట్రెంట్ బౌల్ట్ (కివీస్) టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. హాజిల్‌వుడ్ రెండో, మ్యాట్ హెన్రీ (కివీస్) మూడో ర్యాంక్‌లో నిలిచారు. ఇక షాహిన్ అఫ్రిది (పాకిస్థాన్), బుమ్రా (భారత్) టాప్5 ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించారు.
Joe Root climbs to top in ICC Test Rankings 2022