- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) 2022 ప్రాథమిక కీ విడుదలైంది. http://tstet.cgg.gov.in వెబ్‌సైట్‌లో ప్రాథమిక కీ ని అందుబాటులోకి ఉంచినట్లు టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. ఈ నెల 18 వరకు ప్రాథమిక కీ పై అభ్యంతరాలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు సమర్పించాలని అన్నారు. ఈ నెల 27న టెట్ ఫలితాలు వెల్లడించనున్నారు.
TS TET Exam 2022 Answer Key Released
- Advertisement -