ఎఐసిసి అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఇడి నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ రాజ్ భవన్ ను ముట్టడించిన ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఎఐసిసి అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడి నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ గురువారం తెల్లవారుజామున రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టిన విషయం విధితమే. ఈ పిలుపు మేరకు ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి సారథ్యంలోని తెలంగాణ ఎన్ఎస్ యుఐ బృందం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో రాజ్ భవన్ ని ముట్టడించడంతో రాష్ట్ర అధ్యక్షుడితో కూడిన ఎన్ఎస్ యుఐ బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులపై బిజెపి కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఎఐసిసి అగ్ర నాయకులు సోనియా, రాహుల్ గాంధీకి ఈడి నోటీసులు ఇచ్చిందని. ఇది బిజెపి దమన నీతి అని వెంకట్ మండిపడ్డారు.