Friday, December 20, 2024

హైదరాబాదీ సివిల్ విజేతకు న్యాయం..

- Advertisement -
- Advertisement -

SC Relief to Hyderabad man passed Civil in 2014

హైదరాబాదీ సివిల్ విజేతకు న్యాయం
అతీత అధికారాలను వాడిన సుప్రీం
న్యూఢిల్లీ: సివిల్స్‌లో పాసయ్యి, శరీర బరువు కారణంగా(బిఎంఐ) ఉద్యోగం దక్కని హైదరాబాద్ వ్యక్తికి సుప్రీంకోర్టు బాసటగా నిలిచింది. ఆయనను తగు విధంగా ఉద్యోగంలోకి తీసుకుని తీరాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 పరిధిలో తనకు దక్కిన అధికారాలను వినియోగించుకుని అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. తిరిగి జరిపిన వైద్య పరీక్షలలో ఆయన అన్ని రకాల సర్వీసులకు ఆరోగ్యపరంగా అర్హుడని తేలిందని దీనిని పరిగణనలోకి తీసుకుని తీరాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో తగు న్యాయానికి అన్ని చర్యలూ తీసుకోవాలని పేర్కొంది. హైదరాబాద్ నివాసి అయిన కె రాజశేఖర రెడ్డి 2014 సివిల్ సర్వీస్ పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. అయితే, వైద్య పరీక్షల క్రమంలో ఆయన బిఎంఐ పరిణామం 32గా ఉందని పేర్కొంటూ ఉద్యోగంలోకి తీసుకోవడంపై తాత్కాలిక అనర్హత విధించారు. సాధారణంగా ఈ బిఎంఎస్ 30గా ఉండాలి. 8 ఏండ్ల తరువాత ఇప్పుడు ఆయన సివిల్స్ రాసేందుకు ఉన్న ఐదవ చివరి అవకాశం దశలో సుప్రీంకోర్టు నుంచి రిలీఫ్ దక్కింది. రీ మెడికల్ పరీక్షల నివేదిక ప్రాతిపదికన తాము ఈ ఉత్తర్వులు వెలువరిస్తున్నామని, అధికారులు ఆయనకు ఉద్యోగ కల్పనపై తగు చర్యలు తీసుకోవాలని అజయ్ రస్తోగి, విక్రమ్‌నాథ్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది.

SC Relief to Hyderabad man passed Civil in 2014

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News