Friday, November 22, 2024

ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Student commits suicide by falling off train

మేడ్చల్: ప్రేమ పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లె గ్రామంలో నారకుట్ల రమేష్ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో వర్క ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. అతడు ఓ అమ్మాయి 11 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్నాడు. ఇద్దరు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ప్రేమ పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఆమె లేని తన జీవితం వ్యర్థం అనుకొని ఘట్‌కేసర్-చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య సింహపురి ఎక్స్‌ప్రెస్‌కు ఎదురెల్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘట్‌కేసర్ రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుర్తింపు కార్డుల ఆధారంగా రమేష్‌గా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘట్‌కేసర్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News