Monday, December 23, 2024

‘హౌస్‌ఫుల్’ లాంటి సినిమా

- Advertisement -
- Advertisement -

7 Days 6 Nights movie

మెగా మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. వైల్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్, ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. ఇందులో సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలు. సినిమా ఈనెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ మెహర్ చాహల్ మీడియాతో మాట్లాడుతూ “ఇదొక ఫన్ ఫిల్మ్. యంగ్‌స్టర్స్‌కు నచ్చే చిత్రమిది. ఎంఎస్ రాజు చెప్పిన కథ నచ్చి వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పేశా. సినిమాలో నా క్యారెక్టర్ పేరు రతికా. గోవాలోని ఒక రెస్టారెంట్ లో ఆమె పనిచేస్తుంది. సుమంత్ అశ్విన్‌కు జోడీగా క నిపిస్తా. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా ఇదని చెప్పవచ్చు. హిందీలో ‘హౌస్‌ఫుల్’ సిరీస్‌లో జోక్స్ ఎలా ఉంటాయో… అటువంటి జోక్స్ ఇందులో ఉంటాయి. ప్రేక్షకులు బాగా నవ్వుకోవచ్చు. ఇక ఎంఎస్ రాజుతో ‘సతి’ అనే సినిమా కూడా చేశా. అందులోనూ సుమంత్ అశ్విన్ హీరో. అదొక థ్రిల్లర్ సినిమా. ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నా”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News