కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా ‘కొండా’. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. కొం డా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై కొండా సుష్మితా పటేల్ ఈ చిత్రా న్ని నిర్మించారు. ఈ నెల 23న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇర్రామోర్ మాట్లాడుతూ “నాకు సురేఖమ్మ పాత్ర బాగా నచ్చింది. కాలేజీ జీవితం నుంచి రాజకీయ ప్రయాణం వరకూ ఆమె జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. నటిగా పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న రోల్ ఇది. ఈ పాత్రలో నేను నటించగలనని వర్మ అనుకోవడం నా అదృష్టం. ఇంతకు ముందు వర్మ ప్రొడక్షన్ హౌస్‌లో ‘భైరవగీత’ చేశాను. ఇప్పుడు ఆయ న దర్శకత్వంలో నటించా. ప్రతి సన్నివేశాన్ని ఆయన అద్భుతంగా తీశారు. ఆయన మే కింగ్ ఫాస్ట్‌గా ఉంటుంది. సురేఖమ్మ పబ్లిక్‌లో ఉన్న మనిషి. రాజకీయాల్లో ఉన్నారు. ఆమె కు ఓ ఇమేజ్ ఉంది. ఏ నటికి అయినా సరే ఆ మెలా ఉండటం కష్టం. అయితే సురేఖమ్మలా నటించి ప్రజల్లో గౌరవం సంపాదించుకోవ డం ముఖ్యం. సినిమా చూశాక ప్రేక్షకులు నన్ను గౌరవిస్తారని ఆశిస్తున్నా”అని అన్నారు.
అది నా అదృష్టం
- Advertisement -
- Advertisement -
- Advertisement -