Tuesday, December 24, 2024

టీమిండియాకు రెండో విజయం

- Advertisement -
- Advertisement -

మళ్లీ ఓడిన సౌతాఫ్రికా
2-2తో సిరీస్ సమం

Team India won on South Africa

రాజ్‌కోట్: కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. సౌతాఫ్రికాతో శుక్రవారం జరిగిన నాలుగో టి20లో భారత్ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌ను 22తో స మం చేసింది. ఇక సిరీస్ ఫలితాన్ని తేల్చే ఐదో టి20 ఆదివారం బెంగళూరులో జరుగనుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన సౌతాఫ్రికా 16.5 ఓవర్లలో 87 పరుగులకే ఆ లౌటై ఘోర పరాజయం చవిచూసింది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ బవుమా (8) రిటైర్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.

మరో ఓపెనర్ డికాక్ (13) కూడా నిరాశ పరిచాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ప్రెటోరియస్ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. జట్టును ఆదుకుంటారని భావించిన క్లాసెన్ (8), డేవిడ్ మిల్లర్ (9) కూడా నిరాశ పరిచారు. జాన్‌సెన్ (12), డుసెన్ (20) మినహా మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో అవేశ్ ఖాన్ అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు.

చాహల్ రెండు వికెట్లను పడగొట్టాడు. హర్షల్, భువనేశ్వర్, అక్షర్ తదితరులు కూడా పొదుపుగా బౌలింగ్ చేసి భారత్ విజయంలో తమవంతు పాత్ర పోషించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాను దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్య ఆదుకున్నారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్ 3 సిక్సర్లు, మూడు ఫోర్లతో 46 పరుగులు చేశాడు. ఇక ధాటిగా ఆడిన దినేశ్ కార్తీక్ 27 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్లు 55 పరుగులు సాధించాడు. దీంతో భారత్ స్కోరు 169 పరుగులకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News