అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా కనగాపల్లిలో పరువు హత్య జరిగింది. కానిస్టేబుల్ భర్తను అతి కిరాతకంగా నరికి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మురళీ అనే అనే యువకుడు కియా కార్ల కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కనగాపల్లి గ్రామానికి చెందిన వీణ అనే అమ్మాయిని మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఆమెకు కానిస్టేబుల్ జాబ్ రావడంతో ఏలుకుంట్ల గ్రామ పంచాయతీ జాబ్ చేస్తోంది. వీణ ఇంట్లో ఆమె ప్రేమపెళ్లికి అభ్యంతర చెప్పడంతో ఇదరు ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. వీణ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని నవ దంపతులు నిర్ణయం తీసుకున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఇద్దరు కలిసి రూమ్ తీసుకొని ఉంటున్నారు. మురళి ఆఫీస్‌కు వెళ్లడానికి రాప్తాడు వైజంక్షన్ బస్సు కోసం వేచి చూస్తున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మురళిని కిడ్నాప్ చేశారు. తన భర్తకు వీణ పలుమార్లు ఫోన్ చేసిన స్విచ్ఛాఫ్ రావడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. లింగనపల్లి-రామినేపల్లి గ్రామంలో ఓ యువకుడు హత్యకు గురైన సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా మురళీ మృతదేహంగా గుర్తించారు. తన ప్రేమ వివాహం ఇష్టం లేకపోవడంతో తన తల్లి కిరాయి రౌడీలతో హత్య చేయించి ఉంటుందని రాప్తాడు పోలీస్ స్టేషన్‌లో వీణ ఫిర్యాదు చేసిందని ఎస్‌ఐ రాఘవ రెడ్డి తెలిపాడు.