Saturday, November 23, 2024

ముంబై నుంచి 410 మంది హజ్ యాత్రికుల తొలి బ్యాచ్‌కు జెండా ఊపిన కేంద్ర మంత్రి

- Advertisement -
- Advertisement -
First Haj batch from Mumbai
1,800 మందికి పైగా ముస్లిం మహిళలు ‘మెహ్రం’ లేదా మగ తోడు లేకుండా హజ్‌కు వెళ్తున్నారని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు.

ముంబై: ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 410 మంది హజ్ యాత్రికుల మొదటి బ్యాచ్‌కు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ముంబై నుంచి మొత్తం 8,000 మంది యాత్రికులు 19 విమానాల్లో హజ్ యాత్రకు బయలుదేరుతారు.

నఖ్వీ మాట్లాడుతూ, “2022లో మొత్తం 79,237 మంది భారతీయ ముస్లింలు హజ్ తీర్థయాత్రకు వెళ్తున్నారు. ముఖ్యంగా, వారిలో 50 శాతం మంది మహిళా యాత్రికులు. 1,800 మంది ముస్లిం మహిళలు ‘మెహ్రం’ లేదా మగ తోడు లేకుండా హజ్‌కు వెళ్తున్నారు.

హజ్ అనేది వార్షిక తీర్థయాత్ర.  ముస్లిం విశ్వాసులు ప్రార్థనలు చేయడానికి పవిత్ర క్షేత్రమైన మక్కామదీనాను సందర్శిస్తారు.  భారతదేశంలోని ముస్లింలు ఈ ఏడాది ఈ తీర్థయాత్రను చేపడుతున్నారు. మహారాష్ట్ర నుంచి 4,874 మంది యాత్రికులు హజ్‌ కోసం నమోదు చేసుకున్నారు. ముంబైతో పాటు, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, కొచ్చి, లక్నో, శ్రీనగర్ ,గౌహతి నుండి హజ్ కోసం విమానాలు నడపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News