Saturday, September 21, 2024

అగ్నిపథ్‌ను రద్దు చేయాలి : బోయినపల్లి వినోద్‌కుమార్

- Advertisement -
- Advertisement -

Agneepath should be canceled: Boinapally Vinod Kumar

 

హైదరాబాద్ : భారత్ సైన్యంలో కొత్తగా అగ్నిపథ్ పథకాన్ని తీసుకుని రావాలన్న నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ కోరారు. ఈ మేరకు శనివారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు ఆయన లేఖ రాశారు. ఆర్మీ లో కొత్తగా అగ్ని పథ్ పథకాన్ని తీసుకుని రావాలన్న నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని వినోద్‌కుమార్ సూచించారు.అగ్నిపథ్ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకుని దేశంలోని యువతలో భరోసా పెంచాలని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చర్యలు యువత ఆశలను నీరుగార్చే విధంగా ఉన్నాయన్నారు. అగ్నిపథ్ దేశంలోని యువతలో అగ్నిని రాజేష్తోందని, ఇది దేశ భద్రతకు శ్రేయస్కరం కాదన్నారు. మోడీ ప్రభుత్వం మొదటి నుంచి అనాలోచిత నిర్ణయాలతో దేశ ప్రజలకు గందరోళానికి గురి చేస్తోందన్నారు. ఆర్మీలో కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలు జరపాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తనకు ఆశ్చర్యానికి గురి చేస్తోందని, ఇలాంటి నిర్ణయంతో తన హృదయం గాయపడిందని వినోద్‌కుమార్ తెలిపారు.

దేశ సరిహద్దుల్లో ప్రమాదకర పొరుగు దేశాలు పొంచి ఉన్నాయని, జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శత్రువులతో ప్రమాదం ఉంటున్న ఇలాంటి సమయంలో ఆర్మీ లో అగ్నిపథ్ అమలులోకి తీసుకుని రానుండటం ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు అన్నారు. అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాలలో మిలటరీ శిక్షణ తప్పనిసరి అని, అందు కోసం ఆయా దేశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఆర్మీ రిక్రూట్మెంట్ జరుగుతుందని వినోద్‌కుమార్ గుర్తుచేశారు. అలాంటి పరిస్థితులు మన దేశంలో లేవని, ఆ దేశాల పద్దతులను నఖలు చేస్తే ఎలా..? అని ఆయన ప్రశ్నించారు. జై జవాన్ .. జై కిసాన్ నినాదం భారత దేశం నినాదమని, ఆ నినాదాన్ని మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని అన్నారు. లాభాల బాటలో బ్రహ్మాండంగా సాగుతున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వే, ఎల్‌ఐసి, బిఎస్‌ఎన్‌ఎల్, బిహెచ్‌ఇఎల్., బ్యాంకులు, వివిధ ఆయిల్ కంపెనీలు, ఈసీఐఎల్. వంటి అనేక సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తోందని, ఆ కుట్రలో భాగమే అగ్నిపథ్ నిర్ణయం తీసుకుందని వినోద్‌కుమార్ అన్నారు. దేశవ్యాప్తంగా రాజుకుంటున్న ఆగ్రహ జ్వాలలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా అగ్నిపథ్ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News