Friday, December 20, 2024

రామానంద తీర్థ సంస్థను సందర్శించిన బిసి కమిషన్

- Advertisement -
- Advertisement -

BC Commission visits Ramananda Tirtha rural institute

స్వయం ఉపాధి శిక్షణా కోర్సుల పరిశీలన

మన తెలంగాణ / హైదరాబాద్ : స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థను తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ శనివారం సందర్శించింది. వృత్తుల నవీకరణ, జీవన ప్రమాణాల మెరుగుదల, ప్రత్యామ్నయ ఉపాధి మార్గాలు తదితర అంశాలపై అధ్యయనంలో భాగంగా కమిషన్ చైర్మన్ వకుళాభవరణం కృష్ణమోహన్ రావు సారథ్యంలో సభ్యులు సిహెచ్ ఉపేంద్ర, శుభప్రధ్ పటేల్ నూలి, కె. కిషోర్‌గౌడ్‌లతో కూడిన బృందం రామనంద తీర్థను సందర్శించింది. ఇక్కడ వివిధ వృత్తులు, నైపుణ్యాలలో శిక్షణ నిమిత్తం నిర్వహిస్తున్న కోర్సుల వివరాలను అడిగి తెలుసుకుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన టార్మ్ ఆఫ్ రిఫరెన్స్ కు అనుగుణంగా ఈ అధ్యయనాన్ని బిసి కమిషన్ కొనసాగిస్తుంది. సంస్థలో నిర్వహిస్తున్న కోర్సులు టైలరింగ్, మగ్గం పని, ఎంబ్రాయిడరి, ఆటోమొబైల్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్ తదితర శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో ప్రత్యక్షంగా సమావేశమై వివరాలను సేకరించారు. ఇంకా ఎలాంటి వృత్తి ఆధారిత కోర్సులను ప్రవేశ పెట్టాలో అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రామానంద తీర్థ సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సులో చైర్మన్, సభ్యులు మాట్లాడారు. ఏర్పాట్లను సంస్థ డైరెక్టర్ డా.ఎన్.కిశోర్ రెడ్డి పర్యవేక్షించారు. బిసి కమిషన్‌కు ఇక్కడ ఘనస్వాగతం లభించింది. అంతకు ముందు చైర్మన్, సభ్యులు స్వామి రామానంద తీర్థ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్‌డిఓ సూరజ్ కుమార్, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి పి. యాదయ్య, భూదాన్ పోచంపల్లి తహసిల్దార్ మీరాబాయి ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News