- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన బకాయిలను సోమవారం సాయంత్రంలోగా చెల్లిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ఇప్పటివరకూ 50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడతూ ఇప్పటివరకూ రైతుల నుంచి రూ.9715కోట్ల విలువ మేరకు ధాన్యం కొనుగోలు చేసి అందులో ఇప్పటికే రూ.7464కోట్లు చెల్లించినట్టు తెలిపారు. ఇంకా రూ.2251కోట్లు బకాయి ఉందన్నారు. మిగిలిన ధాన్యం రైస్ మిల్లుల వద్ద ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ పూర్తయ్యాక సోమవారం సాయంత్రంలోగా ధాన్యం రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేయనున్నట్టు మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
- Advertisement -