- Advertisement -
అమరావతి: కాకినాడ గండేపల్లి హైవేపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన కారు లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను తండ్రికొడుకులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. తండ్రి కొడుకు మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.
- Advertisement -