గౌహతి: అస్సాంలోని కాచర్ జిల్లాలో బరాక్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. అది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. అస్సాంలో తీవ్ర వర్షం, వరదల కారణంగా ఇప్పటి వరకు 55 మంది మరణించారు. 28 జిల్లాలు వరద ముంపుకు గురయ్యాయి. దాదాపు 19 లక్షల మంది ప్రభావితులు అయ్యారు. 373 రిలీఫ్ క్యాంపుల్లో 1.08 లక్షలకు పైగా జనులు ఆశ్రయం పొందుతున్నారు. దిమ హసావో, గోల్‌పడ, మోరీగావ్, కామ్‌రూప్ జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ప్రధాని నరేంద్ర మోడీ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మతో మాట్లాడి, వరద పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర నుంచి వీలయినంత సాయం అందిస్తానని వాగ్దానం చేశారు. ముఖ్యమంత్రి బిస్వ వరద ముంపుకు గురైన కామ్‌రూప్ జిల్లాలోని రంగియాను సందర్శించారు. అంతేకాక ఆయన కోలజల్, ఫాతిమా కాన్వెంట్ స్కూల్‌లోని రిలీఫ్ క్యాంప్‌లను కూడా ఆయన సందర్శించారు. ఇదిలావుండగా కోపిలి నది నాగో జిల్లాలోని కామ్‌పుర్ వద్ద వరద స్థాయికి మించి ప్రవహిస్తోందని సెంట్రల్ వాటర్ కమిషన్(సిడబ్లుసి) బుల్లెటిన్ జారీ చేసింది. అస్సాంలో బ్రహ్మపుత్ర, జియా-భరలి, పుథిమారి, మానస్, బేకీ, కుషియారా నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నట్లు ఆ బులెటిన్ పేర్కొంది.
#NewsAlert | Flood situation worsens in #Assam's Cachar district as the Barak River flows above danger level pic.twitter.com/AD2BMS6EMT
— NDTV (@ndtv) June 19, 2022