Saturday, November 23, 2024

శరవేగంగా పట్టణీకరణ

- Advertisement -
- Advertisement -

 

శరవేగంగా పట్టణీకరణ మొదటిపేజీ తరువాయి నీతి అయోగ్ నివేదిక వివరించింది. తెలంగాణ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర (45.23%)  నగరాలను ఆర్థిక వృద్ధి ఇంజిన్‌లుగా పరిగణిస్తున్న నీతి  పట్టణ ప్రాంతాల్లోని ఆర్థిక కార్యకలాపాలు, భారీగా వచ్చే ఆదాయంతో గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు ఎక్కువ అవుతున్నాయని తెలిపింది. ముప్పై ప్రధాన నగరాల్లో ఒకటిగా.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పట్టణ స్థానిక సంస్థల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు రాష్ట్రంలో పట్టణీకరణ వేగం పెరిగిందని వివరించింది. రాష్ట్రంలో ప్రస్తుతం పట్టణాల విస్తీర్ణం 3 శాతం కంటే తక్కువ భూభాగాన్ని కలిగి ఉన్నప్పటికీ, అదే ప్రాంతం రాష్ట్ర జిడిపిలో మూడింట రెండువంతుల వాటాను అందిస్తున్నది. అందుకే గ్రామాల నుంచి పట్టణాల్లో నివాసం ఉండడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఆరు సంవత్సరాలుగా ‘జీవన నాణ్యత సూచిక’లో భారతదేశంలోని అత్యుత్తమ నగరంగా హైదరాబాద్‌ను ‘మెర్సర్’ గుర్తిస్తున్నది. రాష్ట్రంలో అభివృద్ధిని సాధించాలన్న ప్రభుత్వ ఆసక్తికి ఇది నిదర్శనంగా నిలస్తున్నదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. కొనుగోలు శక్తి సూచీ, భద్రతా సూచీ, ఆరోగ్య సంరక్షణ సూచీ, జీవన వ్యయం సూచీ, ఆస్తి ధర  ఆదాయ నిష్పత్తి సూచీ, ట్రాఫిక్ ప్రయాణ సమయ సూచీ, వాతావరణ సూచీలలో నగరం అగ్రస్థానంలో ఉంది. ఈ నగరం దేశంలోని ఏ ఇతర పట్టణ ప్రాంతంతో పోటీ పడనప్పటికీ నాణ్యత, ఆర్థిక పోటీతత్వాన్ని సాధించడానికి ప్రపంచంలోని ముప్పై ప్రధాన నగరాల్లో ఒకటిగా నిలవడం గమన్హారమని నీతిఆయోగ్ పేర్కొంది.2025 నాటికి తెలంగాణలో సగం జనాభా పట్టణాల్లోనే

2050 నాటికి ఇతర రాష్ట్రాలు ఈ స్థాయికి

జీవన నాణ్యత సూచీలో హైదరాబాద్ అత్యుత్తమ నగరం: నీతి అయోగ్ నివేదిక

మనతెలంగాణ/హైదరాబాద్: అన్ని రాష్ట్రాల కంటే వేగంగా తెలంగాణ పట్టణీకరణ అభివృద్ధి చెందుతున్నదని నీతిఆయోగ్ తన నివేదికలో తెలిపింది. 2025 నాటికి రాష్ట్ర జనాభాలో సగం మంది పట్టణాల్లోనే ఉంటారని వివరించింది. దేశంలోని ఇతర రాష్ట్రాల జనాభా ఈ స్థాయికి చేరడానికి మరో రెండున్నర దశాబ్దాలు పడుతుందని నీతి అయోగ్ అంచనా వే సింది. ప్రస్తుతం దేశ జనాభాలో పట్టణ జనాభా సగటు 31.16 శాతం ఉండగా, తెలంగాణలో ఇది 46.08 శాతంగా ఉందని తెలిపింది. పట్టణ జనాభా విషయంలో తెలంగాణ కన్నా తమిళనాడు, కేరళ ముందు స్థానాల్లో ఉన్నాయని వివరించింది. తమిళనాడు పట్టణ జనాభా శాతం 48.45 శాతం కాగా, కేరళలో 47.23 శాతం నమోదైందని నీతి అయోగ్ నివేదిక వివరించింది. తెలంగాణ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర (45.23%) నగరాలను ఆర్థిక వృద్ధి ఇంజిన్‌లుగా పరిగణిస్తున్న నీతి పట్టణ ప్రాంతాల్లోని ఆర్థిక కార్యకలాపాలు, భారీగా వచ్చే ఆదాయంతో గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు ఎక్కువ అవుతున్నాయని తెలిపింది.
ముప్పై ప్రధాన నగరాల్లో ఒకటిగా..
రాష్ట్రం ఏర్పడిన తర్వాత పట్టణ స్థానిక సంస్థల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు రాష్ట్రంలో పట్టణీకరణ వేగం పెరిగిందని వివరించింది. రాష్ట్రంలో ప్రస్తుతం పట్టణాల విస్తీర్ణం 3 శాతం కంటే తక్కువ భూభాగాన్ని కలిగి ఉన్నప్పటికీ, అదే ప్రాంతం రాష్ట్ర జిడిపిలో మూడింట రెండువంతుల వాటాను అందిస్తున్నది. అందుకే గ్రామాల నుంచి పట్టణాల్లో నివాసం ఉండడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఆరు సంవత్సరాలుగా ‘జీవన నాణ్యత సూచిక’లో భారతదేశంలోని అత్యుత్తమ నగరంగా హైదరాబాద్‌ను ‘మెర్సర్’ గుర్తిస్తున్నది. రాష్ట్రంలో అభివృద్ధిని సాధించాలన్న ప్రభుత్వ ఆసక్తికి ఇది నిదర్శనంగా నిలస్తున్నదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. కొనుగోలు శక్తి సూచీ, భద్రతా సూచీ, ఆరోగ్య సంరక్షణ సూచీ, జీవన వ్యయం సూచీ, ఆస్తి ధర ఆదాయ నిష్పత్తి సూచీ, ట్రాఫిక్ ప్రయాణ సమయ సూచీ, వాతావరణ సూచీలలో నగరం అగ్రస్థానంలో ఉంది. ఈ నగరం దేశంలోని ఏ ఇతర పట్టణ ప్రాంతంతో పోటీ పడనప్పటికీ నాణ్యత, ఆర్థిక పోటీతత్వాన్ని సాధించడానికి ప్రపంచంలోని ముప్పై ప్రధాన నగరాల్లో ఒకటిగా నిలవడం గమన్హారమని నీతిఆయోగ్ పేర్కొంది.

People likely to reach towns by 2025 in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News