యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా దర్శకుడు నాగ శేకర్ తెరకెక్కిస్తున్న సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. ప్రతీ ఒక్కరు తమ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విషయాల్ని ఎప్పటికీ మరిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వచ్చే యూత్ లైఫ్లో జరిగే సంఘటనలు జీవితాంతం గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాదకరమైన సంఘటణలు ప్రేక్షకులకి గుర్తు చేసే ఉద్దేశంతో నాగశేఖర్ మూవీస్ బ్యా నర్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్, వే దాక్షర ఫిలిమ్స్ బ్యానర్స్‌పై భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్ ఎస్ రెడ్డి, చినబాబు సం యుక్తంగా నిర్మిస్తున్న సినిమా గు ర్తుందా శీతాకాలం. కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన ‘లవ్ మా క్టైల్’ ఆధారంగా ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందులో సత్యదేవ్, తమన్నా కెమి స్ట్రీ ఈ పాటకు హైలైట్. ఈ సినిమా ను జులై 15న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు.