Friday, December 20, 2024

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. 22 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

Private Travels bus overturns, 22 injured

శ్రీకాకుళం :  జిల్లాలోని నందిగాం మండలం పెద్దతామరపల్లిలో ఆదివారం అర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 22 మంది గాయపడగా.. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలువురు విహారయాత్ర కోసం టూరిస్ట్‌ బస్‌లో కేరళకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 41 మంది ఉన్నట్లు సమాచారం. బస్సు నందిగాం మండలం పెద్దతామరాపల్లి సమీపంలోకి రాగానే డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకోవడంతో జాతీయ రహదారి పక్కనే ఉన్న కల్వర్టును ఢీ కొట్టగా.. బస్సు బోల్తా పడింది. నందిగాం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News