Tuesday, December 24, 2024

లండన్‌లో మంత్రి తలసాని నిరసన..

- Advertisement -
- Advertisement -

Talasani Srinivas Protest in London over Secunderabad violence

మనతెలంగాణ/హైదరాబాద్: అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం జరిగిన సంఘటనతో అక్కడ ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన సంఘటన చాలా బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన రాకేష్ కుటుంబ సభ్యులకు మంత్రి తన తీవ్ర సంతాపం తెలిపారు. గాంధీ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం హింసా వాదాన్ని ప్రోత్సహింస్తుందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు, విధానాలతో దేశం పరువు ప్రతిష్టలు దిగజారుతున్నాయని విమర్శించారు. వ్యవసాయ రంగంలో నల్లచట్టాలను తీసుకొచ్చి. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేకమంది రైతుల ప్రాణాలను బలిగొన్నదని చెప్పారు. మహ్మద్ ప్రవక్తపై అనాలోచిత విమర్శలు చేసి ప్రపంచం ముందు దేశం పరువు, విలువలను దిగజార్చారని ధ్వజమెత్తారు. మోడీకి మంచి బుద్ధి ప్రసాదించాలని లండన్‌లోని గాంధీ విగ్రహానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వినతిపత్రాన్ని అందజేసి వేడుకున్నారు.

Talasani Srinivas Protest in London over Secunderabad violence

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News