నాగపూర్: వ్యవసాయంలో సేంద్రియ, భారతీయ ప్రాచీన సంప్రదాయ విధానం ఎంతో అవసరమని, వాటిని పరిశీలించకుండా ఈ స్థానిక పరిజ్ఞానాన్ని తిరస్కరించడం పొరపాటు అవుతుందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచించారు. న్యూఢిల్లీకి చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ వెటరినరీ సైన్సు, మహారాష్ట్ర యానిమల్, ఫిషరీ సైన్సెస్ యూనివర్శిటీ సంయుక్తంగా నాగపూర్‌లో నిర్వహించిన వార్షిక స్నాతకోత్సవం శాస్త్రీయ సదస్సులో ఆయన మాట్లాడారు. గౌరవ అతిధిగా కేంద్ర మత్స, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రి పర్షోత్తం రూపాలా హాజరయ్యారు.
మంత్రితోపాటు భగవత్‌కు ఈ సందర్భంగా గౌరవ ఫెలోషిప్ ప్రదానం అయ్యాయి. రాష్ట్రమంత్రి సునీల్ కేదార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత వ్యవసాయం, పశుసంరక్షణ విధానాలు చాలా ప్రాచీనమైనవని, ఆధునిక సైన్సులో దుష్ప్రభావాలు ఎదురవుతుంటాయి కానీ మన ప్రాచీన పరిజ్ఞానం, విధానాల్లో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని పేర్కొన్నారు. స్థానిక పరిజ్ఞానం ఉపయోగించి పరిశోధనలో సానుకూలతమై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. యాంత్రిక వ్యవసాయ విధానం ఎక్కువ కాలం సాగదని, ఇప్పటికి కూడా 65 శాతం రైతులు చిన్నకమతాల్లో వ్యవసాయం చేస్తున్నారని వీరికి యాంత్రిక వ్యవసాయ విధానం ప్రయోజనకరం కాదని వివరించారు.
Bharat Centric approach to farming: RSS Chief