Friday, December 20, 2024

ఆస్ట్రల్ పైప్స్ బ్రాండ్ అంబాసిడర్ గా ఐకాన్ స్టార్..

- Advertisement -
- Advertisement -

Allu Arjun as Brand Ambassador to Astral Ropes

హైదరాబాద్: బిల్డింగ్ మెటీరియల్స్‌ను అందించే అగ్రగామి కంపెనీలలో ఒకటైన ఆస్ట్రల్ లిమిటెడ్ అల్లు అర్జున్‌తో జత కట్టి, తమ పైపులు, వాటర్ ట్యాంక్ వ్యాపారాల కొరకు ఆయన్ని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. ఈ బంధం ఆస్ట్రల్ పైప్స్ యొక్క ఎకోసిస్టమ్ అంతటికీ మరింత విలువను, ప్రాముఖ్యాన్ని జోడించి, మార్కెట్‌లో ఆస్ట్రల్ వ్యాపారాల వృద్ధికి మరింత దోహదం చేస్తుంది.

ఈ భాగస్వామ్యం గురించి ఆస్ట్రల్‌కు చెందిన కైరవ్ ఇంజనీర్ ఇలా అన్నారు. “ఈ భాగస్వామ్యం మేము ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నామని సూచిస్తోంది. ఎందుకంటే, అల్లు అర్జున్ తన విశిష్టమైన నటన, డ్యాన్సింగ్ స్టైల్స్, తనకున్న అశేష అభిమానుల ఫాలోయింగ్‌తో విశ్వవిఖ్యాతి పొందారు. దక్షిణ భారత రాష్ట్రాలలో మా బ్రాండ్ ఈక్విటీని తిరిగి బలోపేతం చేసుకునేందుకు, కస్టమర్లు మా బ్రాండ్‌ను మరింత ఎక్కువగా పరిగణించడాన్ని దృఢతరం చేసుకునే లక్ష్యంతో ఆయనను భాగస్వామిగా చేసుకున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది. అత్యంత ప్రజాదరణ కలిగిన స్టార్ ఈ ప్రాంతీయ అనుసంధానానికి జత కడితే ఈ మార్కెట్‌లలో మేము బలంగా నిలద్రొక్కుకునేందుకు, మైండ్ షేర్‌ను, మార్కెట్ షేర్‌ను పెంచుకునేందుకు మాకు బాగా సహాయపడతారు.”

ఈ సెంటిమెంట్‌నే ప్రతిధ్వనిస్తూ అల్లు అర్జున్ ఇలా వ్యాఖ్యానించారు. “ఇంటింటా మార్మోగుతున్న, నాణ్యతకు, నూతన ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందిన, ఎంతో ముందు చూపు కలిగిన బ్రాండ్ అయిన ఆస్ట్రల్ పైప్స్ తో జత కడుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. బ్రాండ్ యొక్క వైవిధ్యభరితమైన శ్రేణిని నేను ప్రపంచానికి చాటి చెప్పగలను. ఈ బంధంతో ఒక్కటై ప్రయాణించాలని ఎదురుచూస్తున్నాను.”

ఆస్ట్రల్ లిమిటెడ్ తమ పైపింగ్ వ్యాపారంతో భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలలో ఒకటి. ఈ వ్యాపారం కంపెనీకి విస్తృతమైన పరిమాణంలో విక్రయాలను అందించి ఆ అభివృద్ధికి ప్రధానంగా దోహదం చేస్తోంది. దక్షిణ భారతదేశం ఆస్ట్రల్ లిమిటెడ్‌కు భారీ మార్కెట్‌గా గుర్తించబడింది. పైపులు, బిల్డింగ్ మెటీరియల్స్ తో బాటుగా, ఇతర నిర్మాణ సామగ్రి శాఖలైన అఢెసివ్‌లు, వాటర్ ట్యాంక్‌లు, శానిటరీవేర్, ఫాసెట్‌ల వంటి వైవిధ్యభరితమైన శ్రేణిని కూడా ఆస్ట్రల్ అందిస్తోంది. గణనీయమైన ఆదాయ వనరులను సాధించడం, తన సమస్త పైపింగ్ వ్యాపారానికి విశేషంగా దోహదపడటం అనే దిశలో పయనించడాన్ని దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఈ వ్యూహాత్మక నిర్ణయాన్ని తీసుకుంది.

Allu Arjun as Brand Ambassador to Astral Ropes

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News