Monday, December 23, 2024

యశోదలో సిఎం సతీమణి

- Advertisement -
- Advertisement -

పరామర్శకు వెళ్లిన
కెసిఆర్, మంత్రులు

మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం యశోద ఆసుపత్రికి వెళ్లారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిఎం కెసిఆర్ సతీమణి శోభను సోమవారం సిఎంతోపాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పరామర్శించారు. కెసిఆర్ తన సతీమణి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. గత కొన్ని రోజులుగా మోకాలి నొప్పి తో బాధపడుతున్న ఆమెకు నొప్పి తీవ్రం కావడంతో చికిత్స కోసం ఆదివారం సోమాజిగూడ యశోద హాస్పిటల్‌లో చేరారు. శోభ కు మోకాలి నొప్పి తీవ్రంగా ఉండటంతో ఆమెకు మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయాలని వై ద్యులు సూచించారు. సిఎం కుటుంబసభ్యుల అంగీకారంతో శోభకు యశోద ఆస్పత్రి డాక్టర్లు మోకాలి ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం స్వల్ప అస్వస్థతతో ఉన్న శోభ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News