హైదరాబాద్: హైదరాబాద్ ఐటి కారిడార్ లో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కైతలాపూర్‌లో రూ. 86 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫ్లై ఓవర్‌ను పురపాలక మంత్రి కెటిఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ… ఈ కైతలాపూర్ ఆర్‌వోబీ అందుబాటులోకి రావడంతో కూకట్‌పల్లి, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు దూరభారం, ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి. సనత్ నగర్- సికింద్రాబాద్ మార్గంలో 3.5 కిలో మీటర్ల దూరం తగ్గనుందన్నారు. ఫ్లైఓవర్ ఏర్పాటుతో హైటెక్ సిటీ-కూకట్ పల్లి, జేఎన్టీయు-హైటెక్ సిటీ మార్గంలో ట్రాఫిక్ సమస్య తీరనుందని మంత్రి చెప్పారు. రూ.8,052 కోట్లతో ఎస్ఆర్ డీపీ ఫేజ్-1 లో భాగంగా 47 కార్యక్రామాలు తీసుకున్నామని కెటిఆర్ తెలిపారు. నగరాభివృద్ధికి సూచిక రహదారులు, ప్రజారవాణ వ్యవస్థేనన్నారు. హైదరాబాద్ ఉత్తర, పశ్చిమ ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువుందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.