- Advertisement -
పెషావర్ : వైద్యుల నిర్లక్ష్యం తీవ్ర విషాదానికి దారి తీసిన ఘటన పాకిస్థాన్ లో వెలుగు లోకి వచ్చింది. అనుభవం లేని సిబ్బంది తప్పిదం కారణంగా డెలివరీ సమయంలో నవజాత శిశువు తల తల్లిగర్భం లోనే తెగిపోయింది. భిల్ హిందూ వర్గానికి చెందిన 32 ఏళ్ల నిండు గర్భిణీ ప్రసవ వేదనతో సమీపం లోని రూరల్ హెల్త్ సెంటర్‌కు వెళ్లింది. అక్కడ గైనకాలజిస్టు అందుబాటులో లేక అనుభవం లేని సిబ్బంది ఆపరేషన్ చేశారు. గర్భం లోనే శిశువు తలను కట్ చేశారు. దీంతో తల గర్భం లోనే మిగిలిపోయింది. దీంతో హుటాహుటిన ఆమెను సమీపం లోని మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆపరేషన్ చేసి శిశువు తలను బయటకు తీశారు. దీంతో బాధిత మహిళకు ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై సింధ్ ప్రావిన్స్ ప్రభుత్వం మెడికల్ దర్యాప్తునకు ఆదేశించింది.
- Advertisement -