Friday, September 20, 2024

మాజీ సైనికులకు ముందు ఉద్యోగాలు ఇవ్వండి..

- Advertisement -
- Advertisement -

లక్నో: సైనిక నియామకాల కోసం కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి మద్దతు పలికిన బడా పారిశ్రామికవేత్తలకు సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మంగళవారం సవాలు విసిరారు. అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తున్న యువజనుల విశ్వాసాన్ని పొందేందుకు మాజీ రక్షణ సిబ్బందిని తమ పరిశ్రమలలో చేర్చుకోవాలంటూ ఆయన పారిశ్రామికవేత్తలను డిమాండు చేశారు. మాజీ సైనికుల పేర్ల జాబితాను తాను అగ్నిపథ్ పథకాన్ని బలపరుస్తున్న పారిశ్రామికవేత్తలకు పంపుతానని ఆయన తెలిపారు. అగ్నిపథ్ పథకాన్ని సమర్థిస్తూ మహీంద్ర గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్ర, ఆర్‌పిజి ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయంకా, బయోకాన్ లిమిటెడ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా తదితరులు సోమవారం ప్రకటనలు చేసిన దరిమిలా అఖిలేష్ మంగళవారం స్పందించారు. భవిష్యత్తులో అగ్నివీరులకు తమ కంపెనీలు, ఆఫీసులలో ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేస్తున్న ఈ బడా పారిశ్రామికవేత్తలకు తాము కూడా మద్దతు ఇస్తామని అఖిలేష్ తెలిపారు. తక్షణమే తమ కంపెనీలలో రిటైర్డ్ సైనికులకు ఉద్యోగాలు ఇచ్చి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన కోరారు. అలా చేయడం వల్ల నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చే అగ్నివీరులకు భరోసా లభిస్తుందని ఆయన అన్నారు.

Industrialists should first employ ex says Akhilesh Yadav

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News