ముంబై: టెలివిజన్ అభిమాన జంట రోహిత్ రెడ్డి, అనితా హస్సానందానీలు ఎప్పుడూ కూడా తమ కుమారుడు అరవ్ కు సమానమైన తల్లిదండ్రులుగా సరైన ఉదాహరణగా నిలుస్తుంటారు. ఈ జంట పాంపర్స్ ఇట్ టేక్స్ 2 క్యాంపెయిన్‌కు మద్దతునందిస్తూ సోషల్‌మీడియా వేదికగా పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులు సమానమైన బాధ్యతలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను తెలుపుతూనే చైల్డ్‌కేర్ బాధ్యతలను గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.
డైపర్ బ్రాండ్ పాంపర్స్ తమ నూతన చిత్రం ద్వారా తల్లిదండ్రల విధులలో ప్రస్తుతమున్న అసమానతలను గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికి కూడా, బుజ్జాయి ఆలనాపాలనా తల్లి బాధ్యతగానే భావిస్తుండటం జరుగుతుంది. శిశువు పుట్టినప్పటి నుంచి ఆమె ప్రధానమైన సంరక్షకురాలిగా నిలుస్తుంది. కానీ ఈ తరతరాల పాత మూసధోరణులు కారణంగా తరచుగా తండ్రులు తమ పిల్లల జీవితంలో అతి ముఖ్యమైన మైలురాళ్లలో భాగమయ్యే అవకాశం కోల్పోయి తరువాత బాధపడుతుంటారు. ఈ నూతన పాంపర్స్ చిత్రాన్ని ఈ భావోద్వేగాలతో తీర్చిదిద్దారు. ఈ క్రమంలోనే ఓ స్వతంత్య్ర సంస్ధ చేత నిర్వహించిన ఓ అధ్యయనంలో ప్రమాదకరంగా 92% మంది తండ్రులు తమ పిల్లలతో అతి తక్కువ సమయం మాత్రమే గడుపుతున్నామని బాధపడుతుండడం గుర్తించారు.
ఈ చిత్రంలో, పిల్లల యోగక్షేమాలను చూసుకోవడం తల్లుల బాధ్యత అనే సంప్రదాయ భావనను తప్పు అని చెబుతూనే, తండ్రులను సైతం భాగం కావాల్సిందిగా కోరుతుంది. తమ పిల్లల పెంపకం దగ్గరకు వచ్చేసరికి క్షమాపణకు అవకాశం లేదనే భావనను తండ్రులు పొందాల్సి ఉందని కూడా వెల్లడిస్తుంది. ఈ చిత్రపు ట్యాగ్‌లైన్ బాప్ బన్నా పడ్తా హై (తప్పనిసరిగా తండ్రిలా ఉండాలి) ద్వారా చిన్నారుల పెంపకంలో తండ్రులు కూడా పాలుపంచుకోవాల్సిన ఆవశ్యకత తెలుపుతుంది. అంతేకాదు, చిన్నారులకు తల్లితో పాటుగా తండ్రి ఆలనాపాలనా కూడా ముఖ్యమని వెల్లడిస్తుంది.
ఈ ప్రచారంతో ఏకీభవించడంతో పాటుగా పేరెంటింగ్ ప్రమాణాలను గురించి రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ‘‘చాలా సందర్భాలు అంటే పిల్లలకు డైపర్ మార్చడం, వారికి ఆహారం అందించడం, వారిని నిద్ర పుచ్చడం లాంటి పనులు తమకు రావని, మహిళలకు అవి సహజసిద్ధంగానే అబ్బుతాయని భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు. మహిళలు సైతం నేర్చుకుంటుంటారు (మరీ ముఖ్యంగా తొలిసారి తల్లిమా మారిన వారు). కాకపోతే మగవారిలా వారేమీ హద్దులు గీసుకోరు. నేను ఈ పేరెంటింగ్‌లో భాగం కావడంతో పాటుగా మా అబ్బాయి ఎదుగుదలలో ప్రతి క్షణమూ భాగం కావడం తో పాటుగా అనితతో పాటుగా సమానంగా వాడిని చూసుకుంటున్నాను. ఆరవ్ ఎదిగే వయసులో ప్రతి క్షణమూ నేను కూడా ఓ భాగం కావడంతో పాటుగా వాడు చేరుకునే మైలురాళ్లు ఏవీ మిస్ కాకూడదని కోరుకుంటున్నాను. అందుకే ఆమె దగ్గర నేర్చుకుంటున్నాను.
శిశువు బాల్యం అత్యంత విలువైనది. తల్లిదండ్రులుగా బాధ్యతలను పంచుకుంటే ఆ బంధం మరింత బలోపేతం కావడంతో పాటుగా చిన్నారితో తల్లిదండ్రులు అనుబంధం కూడా మరింత పెరుగుతుంది. అంతేకాకుండా తల్లి కొంత సేపు విశ్రాంతి తీసుకోవడానికి కూడా సహాయపడుతుంది. ప్రసవం తరువాత తల్లికి విశ్రాంతి అత్యంత కీలకం. నేను తండ్రులందరూ పిల్లల ఎదుగుదలలో భాగం కావడంతో పాటుగా తల్లితో సమానంగా కార్యకలాపాలు నిర్వర్తించేందుకు కృషిచేయాల్సిందిగా కోరుతున్నాను. ఇది ఓ బహుమతిగా నిలుస్తుంది. అంతేకాదు, మీ పిల్లలతో పాటుగా మీ భాగస్వామితో ఏర్పరుచుకునే బంధం వెలకట్టలేనిదిగా మారుతుంది’’ అని అన్నారు.
అనితా హస్సానందానీ మాట్లాడుతూ.. ‘‘తొలి రోజు నుంచే నాతో సమానంగా మా అబ్బాయి బాధ్యతలలో పాలుపంచుకుంటున్నాడు. (నిజం చెప్పాలంటే నాకెప్పుడైతే ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయిందో అప్పటి నుంచి అతను తండ్రిగా తన బాధ్యతలు నెరవేర్చడం ప్రారంభించాడు). అతని కారణంగానే నేను నా వర్క్ కమిట్‌మెంట్స్‌ను ఆరవ్ పుట్టిన తరువాత వేగంగా నెరవేర్చగలుగుతున్నాను. ఆరవ్ ఈ ప్రపంచంలోనికి అడుగు పెడుతున్నప్పుడు నేను తీవ్రంగా ఆందోళనపడితే ,అతను మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. ఓ జంటగా, మేము పూర్తి స్పృహతో బాధ్యతలను ఇద్దరమూ పంచుకోవాలని, తల్లిదండ్రులుగా ఆనందం పొందాలనుకున్నాము. పాంపర్స్ రూపొందించిన బాప్ బనానా పడ్తాహై ఇప్పుడు నూతన తరపు తండ్రులపై దృష్టి సారించడంతో పాటుగా కేవలం తల్లి మీదనే మొత్తం భారం పడేయవద్దని కోరుతుంది. మనం తల్లి, తండ్రిగా మారక మునుపు మనం తల్లిదండ్రులుగా మారతాము. అదీ మనం కోరుకుని, అందువల్ల, పురుషులు తమ బిడ్డ ఎదుగుదలలో పూర్తిగా పాలు పంచుకోవడంతో పాటుగా తల్లిదండ్రులుగా తమ బాధ్యతలను నెరవేర్చాలి’’ అని అన్నారు.
పెద్ద వయసు కలిగిన ఓ తండ్రి దృష్టి కోణం నుంచి చెబుతున్నట్లుగా పాంపర్స్ యొక్క నూతన చిత్రం ఇట్ టేక్స్ 2 ఉంటుంది. తండ్రిగా మారబోతున్న తన కుమారుడికి ఓ తండ్రి అందించే సందేశంలా ఇది ఉంటుంది. ఆకట్టుకునే రీతిలో జరిగే ఈ సంభాషణ ఓ హాస్పిటల్‌లో జరుగుతుంది. దీనిలో పెద్ద వయసు వ్యక్తి , తన కుమారుడు ఎదుగుతున్న సమయంలో తాను అక్కడ లేనని చెబుతుండటం కంట తడిపెట్టిస్తుంది. తన కుమారుని కోసం కాలం వెనక్కితిరిగి వెళ్లాలని కోరుకుంటున్నట్లు తెలిపిన ఆయన తన కుమారుడు చేరుకున్న ప్రతి మైలురాయిలోనూ భాగం కావాలనుకుంటున్నట్లు తెలుపుతాడు. ఓ నర్సు అతని మాటలకు అడ్డుతగిలి, కళ్లలో నీళ్లు తిరుగుతున్న వ్యక్తితో మీరు తండ్రి అయ్యారని చెబుతుంది. అతను తన చేతుల్లోకి శిశువును తీసుకుని, అతని కుమారునితో నీ ప్రతి అడుగులో తానుంటానని వాగ్ధానం చేస్తాడు. తన తండ్రి మాటలు బాప్ బనానా పడ్డాహై ను గుర్తుకు తెచ్చుకుంటాడు.
నూతన తండ్రులు, తల్లిదండ్రులుగా సమానంగా బాధ్యతలు నెరవేర్చవలసి ఉంటుందంటూ, పాంపర్స్ ఇప్పుడు బేబీ టైమ్ ను పరిచయం చేసింది. తమ శిశువులతో మరింత నాణ్యమైన సమయం తండ్రులు గడిపేందుకు ఇది తోడ్పడుతుంది. అంతేకాదు పిల్లల ఎదుగుదలలో మరింతగా భాగమయ్యే తండ్రులగానూ మారుస్తుంది. బేబీ టైమ్ అనేది కంటెంట్, కమ్యూనిటీ క్యూరేషన్. దీనిలో తండ్రులు పేరెంటింగ్ సలహాలు, సూచనలను నిపుణుల నుంచి పొందడంతో పాటుగా తల్లిదండ్రులుగా సమానంగా ఏవిధంగా బాధ్యతలు నిర్వర్తించాలో కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం 2 లక్షల మందికి పైగా తండ్రులు దీనిలో భాగమయ్యారు.
ఈ ప్రచారం గురించి అభిషేక్ దేశాయ్, వైస్ ప్రెసిడెంట్ అండ్ బిజినెస్ హెడ్– బేబీ కేర్ – ప్రొక్టర్ అండ్ గ్యాంబెల్ మాట్లాడుతూ..‘‘ మా ఇట్ టేక్స్ 2 ప్రచారం ద్వారా నూతన తండ్రులకు స్ఫూర్తి కలిగిస్తూనే శిశువు జన్మించిన తొలి రోజు నుంచే పూర్తిగా అంకితం చేయబడిన పేరెంట్‌గా నిలువమని కోరుతుంది. తద్వారా తమ శిశువు ఎదుగుదలలో అత్యంత కీలకమైన మధురక్షణాలు, మైలురాళ్లను వారు చూడలేకపోయామనే బాధ ఉండదు. తండ్రిగా మారడం ఓ అనిర్వచనీయ అనుభూతి. బాప్ బనానా పడ్డా హై . తమ పిల్లలు, తల్లిదండ్రులకు అందించిన వాగ్ధానాన్ని నెరవేర్చిన, నేరవేరుస్తోన్న తండ్రులకు ధన్యవాదములు. కానీ సమానమైన కో–పేరెంటింగ్‌ను ఓ ప్రమాణంగా మార్చడంలో మనం ఎంతో దూరం వెళ్లాల్సి ఉంది’’అని అన్నారు.
Film link- https://www.youtube.com/watch?v=uyjNptXJfz8
Actress Anitha Couple supports to Pampers it takes 2