- Advertisement -
భువనేశ్వర్ : ఒడిశా లోని నౌపాడ జిల్లాలోని బోడెన్ బ్లాక్‌లో సిఆర్‌పిఎఫ్ జవాన్లపై మావోయిస్టులు మెరుపు దాడికి పాల్పడడంతో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో ఏడుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒకరు సిఆర్‌పిఎఫ్ జవాను కాగా, ఇద్దరు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ర్యాంకు వారు. రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి భద్రత కోసం సిఆర్‌పిఎఫ్ జవాన్లు వెళ్లగా గ్రెనేడ్‌లు ఉపయోగించి మావోయిస్టులు దాడి చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో నౌపాడ జిల్లాలో పోలీస్‌లు హైఅలర్ట్ ప్రకటించారు.
- Advertisement -