- Advertisement -
న్యూఢిల్లీ: ప్రపంచ కప్ హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత మహిళా జట్టును మంగళవారం ఎంపిక చేశారు. స్పెయిన్ వేదికగా జులై ఒకటి నుంచి ఈ పోటీలు జరుగనున్నాయి. ప్రపంచకప్ కోసం 18 మందితో కూడిన జట్టును హాకీ ఇండియా ఎంపిక చేసింది. భారత జట్టుకు గోల్ కీపర్ సవిత కెప్టెన్‌గా వ్యవహరించనుంది. గ్రేస్ ఎక్కా వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది. రెగ్యూలర్ కెప్టెన్ రాణి రాంపాల్ గాయం వల్ల ప్రపంచకప్‌కు దూరమైంది. దీంతో ఆమె స్థానంలో సవితకు సారథ్య బాధ్యతలను అప్పగించారు. సవితతో పాటు బిచ్చు దేవి గోల్ కీపర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. దీప్ గ్రేస్ ఎక్కా, గుర్జీత్ కౌర్, నిక్కి ప్రధాన్, ఉడిత, నిషా, సుశీల, మోనిక, నేహా, జ్యోతి, నవ్‌జీత్ కౌర్, సోనిక, సలీమా, వందన కటారియా, లాల్‌రెమ్‌సియామి, నవ్‌నీత్ కౌర్, షర్మిలా దేవి జట్టులో చోటు సంపాదించారు.
India Hockey announced Women Team
- Advertisement -