Monday, December 23, 2024

వరల్డ్ లైన్ ఇండియాతో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ భాగస్వామ్యం..

- Advertisement -
- Advertisement -

ముంబై: బజాజ్ ఫిన్ సర్వ్ లిమిటెడ్ రుణ విభాగం, భారతదేశ అతిపెద్ద, అత్యంతగా వైవిధ్యీకృతమైన ఎన్ బిఎఫ్ సి కంపెనీ బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ (బిఎఫ్ఎల్), తన మర్చంట్ నెట్ వర్క్ కోసం పాయింట్ ఆఫ్ సేల్స్ (పిఒఎస్) పేమెంట్ అక్వైరింగ్ సొల్యూషన్స్ కోసం పేమెంట్ సేవల్లో అంతర్జాతీయ అగ్రగామి అయిన వరల్డ్ లైన్ తో భాగస్వామిగా మారింది.

భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా కూడా పేమెంట్ ఎకో సిస్టమ్ లో సుసంపన్న అనుభవం కలిగిన కంపెనీ వరల్డ్ లైన్. తన మర్చంట్ అక్వైరింగ్ ఇన్షియేటివ్ ను వృద్ధి చేసేందుకు, నిర్వహించేందుకు సాంకేతిక, సర్వీ స్ భాగస్వామిగా ఇది బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ చే ఎంచుకోబడింది. ఇది దేశవ్యాప్తంగా మర్చంట్ లొకేషన్స్ లో ఉనికి కలిగిఉంది.

ఈ ఒప్పందంతో, పాయింట్ ఆఫ్ సేల్ టర్మినల్స్ అందించడం ద్వారా, ఈఎంఐ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, యూ పీఐ, వాలెట్స్ లాంటి వాటి నుంచి విస్తృత శ్రేణి చెల్లింపులకు వీలు కల్పించడం ద్వారా తన ప్రస్తుత, నూతన మర్కంట్ పార్ట్ నర్స్ నెట్ వర్క్ భాగస్వాములతో తన అనుబంధాన్ని మరింత మెరుగుపర్చుకోవడాన్ని బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ తన లక్ష్యంగా చేసుకుంది.

ఈ లావాదేవీల సేవలకు అదనంగా బిల్లింగ్ ఇంటిగ్రేషన్స్, ఈఎంఐ ఆఫరింగ్స్, ట్రాన్సాక్షన్స్ ప్రాసెసింగ్, డేటా అనలిటిక్స్, ఫ్రాడ్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ వంటి విలువ జోడించబడిన సేవలను కూడా ఈ భాగస్వామ్యం అందించనుంది. బజాజ్ ఫైనాన్స్ కు చెందిన 58 మిలియన్ల కస్టమర్లు బజాజ్ నెట్ వర్క్ ఈఎంఐ కార్డ్, బజాజ్ పే వాలెట్, బజాజ్ పే యూపీఐ, బజాజ్ కాయిన్స్ రిడింప్షన్ వంటి వివిధ సేవలను ఆయా పాయింట్ ఆఫ్ సేల్స్ అవు ట్ లెట్స్ వద్ద ఉపయోగించుకునేందుకు ఈ భాగస్వామ్యం వీలు కల్పిస్తుంది.

ఈ సందర్భంగా బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ జైన్ ఈ భాగస్వామ్యం గురించి మాట్లా డుతూ, ‘‘డిజిటల్ ఆఫరింగ్స్ ను విస్తరించాలన్న మా విస్తృత ఆశయానికి అనుగుణంగా గత ఏడాది మేం కస్టమర్లకు, మర్చంట్ భాగస్వాములకు ఇంటిగ్రేటెడ్ పేమెంట్ సొల్యూషన్ అందించేందుకు గాను డిజిటల్ చెల్లింపుల వ్యాపారం లోకి ప్రవేశించాం. బజాజ్ ఫైనాన్స్ అటు వినియోగదారులకు, ఇటు వ్యాపారులకు నిలకడగా తిరుగులేని క్రెడిట్ పరిష్కారాలను అందిస్తోంది. ఈ భాగస్వామ్యం మా ఉత్పాదనల సూట్ ను విస్తరించేందుకు మాత్రమే గాకుండా క్రెడిట్ ఉత్పాదనలకు అదనంగా మా విస్తరిస్తున్న మర్చంట్ స్టోర్స్ నెట్ వర్క్ పై కామర్స్, పేమెంట్ టెక్నాలజీలు దేశవ్యాప్తం అయ్యేందుకు కూడా దోహదం చేయనుంది’’ అని అన్నారు.

‘‘డిజిటల్ ఫైనాన్స్ లో బజాజ్ ఫైనాన్స్ ఎల్లవేళలా అగ్రగామిగా ఉంటోంది. వరల్డ్ లైన్ అధునాత సాంకేతిక త సంచలనాత్మక ఇన్ స్టోర్ పేమెంట్ యాక్సెప్టెన్స్ అనుభూతిని మా మర్చంట్ భాగస్వాములకు అంది స్తుందని విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.

వరల్డ్ లైన్ ఇండియా (ఎస్ఏ, ఎంఈ) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ దీపక్ చంద్ నాని ఈ సందర్భంగా మాట్లాడు తూ, ‘‘సులభ, వేగవంతమైన, భద్రమైన డిజిటల్ యాక్సెప్టెన్స్ సొల్యూషన్స్ ను అందించేందుకు గాను బ జాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ తో భాగస్వామ్యం వరల్డ్ లైన్ ఇండియాకు ఎంతో గర్వకారణం. యావత్ మర్చంట్ లైఫ్ సైకిల్ జర్నీని సృష్టించడంలో, నిర్వహించడంలో మా నైపుణ్యం, తమ విలువైన కస్టమర్లకు సుసంప న్న అనుభూతిని అందించేలా చేయడంలో బీఎఫ్ఎల్ కు తోడ్పడనుంది. అంకితభావంతో కూడుకున్న మా సిబ్బంది బజాజ్ ఫైనాన్స్ అవసరాలను సమర్థంగా తీర్చగలుగుతారు. అది రెండు సంస్థల ఉన్నతికి తోడ్ప డనుంది. భారతదేశంలో, ఇతర మార్కెట్లలో మేం భారీ స్థాయి భాగస్వామ్యాలను విజయవంతంగా నిర్వహించాం. ఉభయతారకంగా ఉండేటా బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ తో దీర్ఘకాలిక అనుబంధాన్ని కోరుకుంటున్నాం’’ అని అన్నారు.

Bajaj Finance Ltd tie up with Worldline India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News