- Advertisement -
కొల్చారం: మెదక్ జిల్లా కొల్చారం మండలం కొంగోడులో బుధవారం విషాదం చోటుచేసుకుంది. పొలంలో జెసిబి తీసిన గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. స్థానికుల సమాచారంతో హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థులను మంగలి అజయ్( 4వ. తరగతి), మంగలి నర్సింహులు (1వ.తరగతి) చదువుతున్నట్లు గుర్తించారు.
- Advertisement -