Friday, December 20, 2024

ఇండో-అమెరికన్ శాస్త్రవేత్త ఆర్తి ప్రభాకర్‌కు అత్యున్నత పదవి

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షునికి సైన్స్ అండ్ టెక్నాలజీ సలహాదారుగా ప్రముఖ భారతీయ-అమెరికన్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్తి ప్రభాకర్‌ను జో బైడెన్ ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ నిర్ణయాన్ని వైట్ హౌస్‌తోపాటు భారతీయ-అమెరికన్ పౌరులు చారిత్రాత్మకంగా అభివర్ణించారు. ఈ నియమాకాన్ని అమెరికన్ సెనేట్ ఆమోదిస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ కార్యాలయాన్ని(ఓఎస్‌టిపి) డైరెక్టర్‌గా నేతృత్వం వహించే తొలి ప్రవాసురాలిగా డాక్టర్ ఆర్తి ప్రభాకర్ చరిత్ర సృష్టిస్తారు. బైడెన్ ప్రభుత్వంలో అత్యంత కీలక పదవికి తాజాగా నియమితురాలైన తొలి భారతీయ-అమెరికన్ సమాజానికి చెందిన అత్యున్నత విద్యావంతురాలిగా కూడా ఆమె చరిత్ర సృష్టిస్తారు. ఈ నియామకం సెనేట్ ఆమోదం పొందిన తర్వాత ఆమె సైన్స్ అండ్ టెక్నాలజీలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు సహాయకురాలిగా, ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తారు.

Indo-American Scientist as Biden’s top science advisor

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News