మనతెలంగాణ/హైదరాబాద్ : వివిధ కారణాల నేపథ్యంలో కొన్ని రైళ్లను రద్దు చేయగా మరికొన్ని రైళ్లను దారి మళ్లీంచినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ‘అగ్నిపథ్’పై దేశ వ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో యువత పెద్ద ఎత్తున బీభత్సం సృష్టించిన నేపథ్యంలో పలు రైళ్ల సమయ వేళల్లో మార్పులు జరగడంతో పాటు కొన్ని రైళ్లను కొంతకాలం రద్దు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. అలాగే పలుచోట్ల వరదల దారణంగా రైళ్లను రద్దు చేయాలని నిర్ణయించినట్టు దక్షిణమధ్య రైల్వే పేర్కొంది. బుధవారం నుంచి 262 రైళ్లను రద్దు చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. దీంతోపాటు మరో 9 రైళ్లను రీ షెడ్యుల్ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందులో రైలు నంబర్లు 04133, 05122, 05163, 05446. 1280, 13106, 16521, 17650, 22638 ఉండగా, వీటితో పాటు 16 రైళ్లను దారి మళ్లీంచాలని నిర్ణయించినట్టు రైల్వే అధికారులు తెలిపారు.