ప్రారంభించిన ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
మన తెలంగాణ/ హైదరాబాద్: ఆర్థిక సేవల సంస్థ ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పరిశ్రమలోనే తొలిసారిగా క్రెడిట్ కార్డ్ ఎల్‌ఐటి(లైవ్ ఇట్ టుడే)ని ప్రారంభించింది. ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ బ్యాంక్‌లలో ఒకటి, కార్డ్ హోల్డర్‌లకు- వారు కోరుకునే ఫీచర్‌లను ఎంచుకొనే అవకాశాన్ని, కోరుకున్న కాల వ్యవధికి ప్రత్యేకమైన విలువ ప్రతిపాదనను అందిస్తుంది. పే-పర్ -ఫీచర్, ప్రయాణం, వినోదం, షాపింగ్, ఇంధనం, భోజనం- అన్నీ ఒకే కార్డుతో ప్రయోజనాలను పొందేందుకు ఏదైనా ఫీచర్‌ని ఆన్, ఆఫ్ చేసే స్వేచ్ఛను ప్రవేశపెడుతుంది. ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండి, సిఇఒ సంజయ్ అగర్వాల్ మాట్లాడుతూ, ఇది అనేక క్రెడిట్ కార్డ్‌ల లక్షణాలను ఒకే కార్డ్‌లోకి తీసుకువస్తోందని, ఇటువంటి అనేక వినూత్న ఉత్పత్తులను ప్రారంభించడం కొనసాగిస్తామని అన్నారు. సంస్థ మిషన్ ‘బద్లావ్ హమ్ సే హై’ ద్వారా మార్పు ఏజెంట్‌గా ఉండాలనే మిషన్‌కు కట్టుబడి ఉంటామని అన్నారు.