Monday, December 23, 2024

క్రికెట్‌కు రుమేలీ ధార్ గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

Rumeli Dhar Announced retired from all formats

ముంబై: భారత ఆల్ రౌండర్ రుమేలీ ధార్ 38సంవత్సరాల వయస్సులో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించింది. 2003లో ఇంగ్లాండ్ జట్టుపై అరంగేట్రం చేసిన రుమేలీ ధార్. 2018లో ఆస్ట్రేలియాతో తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడింది. ఆమె 2009లో జరిగిన టీ20 వరల్ కప్లో ఆరు వికెట్లు పడగొట్టింది. టోర్నీలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్గా నిలిచింది. ఇక దక్షిణాఫ్రికాలో జరిగిన 2005 ప్రపంచకప్ ఫైనల్కు టీమిండియా చేరుకోవడంలో రుమేలీ ధార్ కీలకపాత్ర పోషించింది. ఇకపోతే భారత మహిళల క్రికెట్లో అత్యుత్తమ ఫీల్డర్లలో రుమేలీ ఒకరు. ఆమె నాలుగు టెస్టు మ్యాచ్లతో సహా టీమిండియా తరపున మొత్తం 100అంతర్జాతీయ మ్యాచ్లు ఆడింది. ఆమె 78వన్డేలలో 19.61సగటుతో 961పరుగులు చేసింది. 18 టీ20లలో 18.71సగటుతో 88.51స్ట్రైక్ రేట్తో 131పరుగులు చేసింది. ఆమె నాలుగు టెస్ట్ మ్యాచ్లలో 29.5సగటుతో 236 పరుగులు చేసింది. రైట్ ఆర్మ్ పేసర్ అయిన రుమేలీ ధార్.. తన బౌలింగ్ నైపుణ్యంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో 76వికెట్లు తీసింది. ఇకపోతే బుధవారం మధ్యాహ్నం తన రిటైర్మెంట్ ప్రకటిస్తూ.. ఇన్స్టాగ్రామ్లో సుదీర్ఘ పోస్ట్ పెట్టింది.

Rumeli Dhar Announced retired from all formats

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News