Monday, December 23, 2024

రసవత్తరంగా రంజీ ఫైనల్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: రంజీ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్కు దిగింది. మొదటి రోజు ఆట ముగిసే టైంకు 90ఓవర్లకు 5వికెట్లు కోల్పోయి 248పరుగులు చేసింది. ఇక కెప్టెన్ పృథ్వీ షా (47 పరుగులు 79బంతుల్లో 5ఫోర్లు 1సిక్సర్), యశస్వి జైశ్వాల్ (78పరుగులు 163బంతుల్లో 7ఫోర్లు 1సిక్సర్) రాణించారు. ఇక ముంబై ఇన్నింగ్స్లో ఓపెనర్లు పృథ్వీ షా, యశస్వి జైశ్వాల్ శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు అడపాదడపా బౌండరీలు బాదారు. ఇక 27ఓవర్ల పాటు వికెట్ చేజార్చుకోకుండా అత్యంత జాగ్రత్తగా ఆడారు. తొలి వికెట్కు వీరిద్దరు 87పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇక మధ్యప్రదేశ్ బౌలర్ అనుభవ్ అగర్వాల్ ఈ జోడీని విడదీశాడు. తన అద్భుతమైన బంతితో పృథ్వీ షాను బౌల్ చేశాడు.

ఇక అర్మన్ జాఫర్ (26పరుగులు 56బంతుల్లో) కాసేపు క్రీజులో తచ్చాడినా అతన్ని కార్తీకేయ పెవిలియన్కు పంపించాడు. సువేద్ పా ర్కర్ (18పరుగులు 30బంతుల్లో) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. క్రీజులోకి ఫామ్లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ దిగాడు. అలాగే మరో ఎండ్లో ఫామ్లో ఉన్న యశస్వి జైశ్వాల్ కూడా కుదురుగా ఆడడంతో కాసేపు ముంబై భారీ స్కోరు దిశగా వెళ్తుందనిపించింది. ఇక మరోసారి సెంచరీ చేస్తాడనుకుంటున్న టైంలో యశస్వి జైశ్వాల్ను అనుభవ్ అగర్వాల్ బుట్టలో వేశాడు. అతను 78పరుగుల వద్ద క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఇక హార్దిక థామోర్ (24పరుగులు 44బంతుల్లో) పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఇక డే ముగిసేదాకా క్రీజులో సర్ఫరాజ్ ఖాన్ (47పరగులు 79బంతుల్లో 5ఫోర్లు, 1సిక్సర్ నాటౌట్), సామ్స్ ముల్తానీ (12పరుగులు 43బంతుల్లో నాటౌట్) అత్యంత డిఫెన్సివ్గా ఆడుతున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో లీడ్ సంపాదించాలనేది ముంబై ప్రణాళిక. తద్వారా మ్యాచ్ డ్రా అయినా గెలుపు తమ సొంతమవుతుందని ఇన్నింగ్స్ నిర్మించేందుకు బాగా కష్టపడుతుంది. మరో 150 నుంచి 200పరుగులు చేస్తే ముంబై సైడ్ మ్యాచ్ ఎడ్జ్ అవకాశముంటుంది.

Ranji Trophy: Mumbai 248/5 runs against Madhya Pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News