- Advertisement -
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలం కడ్చర్లలో గురువారం ఉదయం ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. వనం పల్లి దగ్గర ఇంటర్ చదువుతున్న యువతి, యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -